Monday, April 7, 2025

తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. భారీగా కోళ్లు మృతి

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఓ పౌల్ట్రీ ఫామ్ లో నాలుగు రోజుల క్రితం వేల కొద్దీ కోళ్లు మృతి చెందాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ క్రమంలో కోళ్ల రక్త నమూనాలను సేకరించి టెస్టు చేసిన అధికారులు.. బర్డ్ ఫ్లూగా నిర్దారించారు. దీంతో పౌల్ట్రీ ఫామ్ యజమానులను అధికారులు అలర్ట్ చేశారు.కోళ్లతోపాటు కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దని అధికారులు ఆదేశించారు. పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతుండటంతో కోట్లలో ఆస్థి నష్టం జరిగినట్లు పౌల్ట్రీ ఫామ్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్‌ఫ్లూ కలకలంతో ప్రస్తుతం 300 రూపాయలు ఉన్న కేజీ చికెన్ ధర భారీగా పడిపోయే అవకాశం ఉంది.

కాగా, ఇటీవల ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ సోకి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బర్డ్‌ఫ్లూ మళ్లీ విస్తరిస్తుండటంతో కొన్ని రోజులు చికెన్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని నాన్ వెజ్ ప్రియులు సైతం దూరంగా ఉండాలని అనుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News