Monday, January 20, 2025

ప్రాణం కాపాడిన మనిషితో పక్షి చెలిమి (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: మనుషులకు, జంతువులకు మధ్య చెలిమి ఈనాటిది కాదు. సొంత మనుషుల కన్నా పెంపుడు జంతువులంటే ప్రాణం పెట్టే జంతు ప్రేమికులను కూడా మనం చూస్తుంటాం. అలాగే పక్షుల ప్రేమికులు కూడా మనకు కనిపిస్తారు. అయితే..తన ప్రాణాలను కాపాడిన ఒక వ్యక్తి పట్ల ఒక కొంగకు కృతజ్ఞతా భావం ఏ స్థాయికి వెళ్లిందంటే తన ప్రాణదాతకు నీడలా ఉంటూ అతనితోనే తన లోకం అన్న స్థాయికి చేరుకుంది. ఆరిఫ్ అనే యువకుడికి సంబంధించిన వీడియోను ఐఎఎస్ అధికారి మనీష్ శరణ్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఆరిఫ్ టూవీలర్‌పై వెళుతుంటే అతడిని నీడలా వెన్నాడుతున్న కొంగను ఈ అందమైన వీడియోలో వీక్షించవచ్చు. నెటిజన్ల మనసు దోచుకున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వెరల్ అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News