Monday, April 7, 2025

12న కవాల్‌లో బర్డ్ వాక్

- Advertisement -
- Advertisement -


మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలోని దట్టమైన అడవులు.. అందమైన కొండలు, జలపాతాలు ప్రకృతికి నిలయంగా మారాయి. ఈ అటవీ ప్రాంతాల్లో వివిధ రకాల పక్షులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ నెల 12,13వ తేదీల్లో బర్డ్ వాక్ ఈవెంట్ ను కవాల్ టైగర్ రిజర్వ్‌లో అటవీశాఖ నిర్వహిస్తోంది. వారాంతంలో ఔత్సాహిక ప్రకృతి ప్రేమికులు, పక్షి వీక్షకులు అందరూ ప్రకృతిని అన్వేషించడానికి వీలుగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కవాల్ టైగర్ అభయారణ్యంలో వృక్ష, జంతుజాలంలో గొప్ప జీవ వైవిధ్యం కలిగి ఉంది. 300కు పైగా పక్షి జాతులు.. 600పైగా వృక్షజాతులు ఉన్నాయి. టేకు, వెదురుతో పాటు వివిధ అటవీ వృక్షాలు ఉన్నాయి. బర్డ్ వాక్ ఈవెంట్ ను 12వ తేదీ ఉదయం 11 గంటలకు రిజిస్ట్రేషన్‌తో పాటు పరిచయంతో కార్యక్రమం ఉంటుందన్నారు. స్థానిక, వలస పక్షులతో పాటు అరుదైన పక్షులను వీక్షించే వీలుంది. పర్యాటకులు తమ పేర్ల నమోదుకు ఎఫ్‌ఆర్‌ఓ ఎండి హఫీజుద్దీన్, ఇందన్‌పల్లి (9948751980) ఫోన్‌లో సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు అటవీ డివిజనల్ అధికారి ఎస్.మాధవరావు (9440810103)ను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News