Sunday, January 5, 2025

పక్షుల విన్యాసాలు చూడతరమా..!?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతితో ముడిపడిన అందాలను ప్రతి వీకెండ్‌లో వీక్షిస్తూ ఆ అరుదైన దృశ్యాలను తన కెమెరాలో నిక్షిప్తం చేయడంతో పాటు వాటిని తన ట్విట్టర్‌లో పొందుపరుస్తూ నెటిజన్లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, పర్యావరణ పరిరక్షకులు, జంతు ప్రేమికులు, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ అబ్బుర పరుస్తుంటారు. ఈ వీకెండ్‌లో భాగంగా చెట్లకొమ్మలపై పక్షుల విన్యాసాలను ఆయన చిత్రీకరించారు. ఆ దృశ్యాలు నెటిజన్లను కనువిందు చేశాయి. ప్రకృతి రమణీయతతో పాటు ప్రకృతితో మమేకమైన పక్షుల ఫోటోలను, అందునా అరుదైన దృశ్యాలను తన కెమెరాలో ఆయన బంధిస్తుంటారు. ఆ దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను, పర్యావరణ పరిరక్షకులను కట్టిపడేస్తాయనడంలో సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News