Tuesday, April 1, 2025

‘ఉగాది పర్వదినం.. మామిడిపండ్లను ఆస్వాదిస్తున్న పక్షులు’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉగాది పర్వదినం. ప్రతి ఒక్కరి హృదయాల్లో పులకింత. మంచి, చెడుల మేళవింపుకు ప్రతీక. షడ్రుచులతో నూతన సంవత్సరానికి స్వాగతాంజలి పలుకుతూ ఉగాది పచ్చడిని ఆస్వాదించడం ఆనవాయితీ. అలాంటి అరుదైన ఉగాది పండుగను పక్షులు ఆస్వాది స్తున్న దృశ్యాలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, పర్యావరణ పరిరక్షకుడు, జంతు ప్రేమికుడు, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ తన కెమెరాలో బంధించారు.

అందమైన ఉగాది పండుగ సందర్భంగా మామిడి పండ్లను ఆస్వాదించే పక్షుల అద్భుతమైన చిత్రాలను ఆయన తన ఎక్స్(ట్విట్టర్)లో పొందుపర్చారు. అలాంటి అరుదైన దృశ్యాలను వీక్షించి నెటిజన్లు, జంతు ప్రేమికులు మాజీ ఎంపి సంతోష్‌పై అభినందనల జల్లు కురిపించారు. పర్యావరణ పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటుతూ ప్రకృతిలో భాగమైన పక్షుల అరుదైన దృశ్యాలను వీకెండ్‌లో సందర్భోచిత రీతిలో తన కెమెరాలో బంధిస్తున్నారు. అవి నెటిజన్లను, జంతు ప్రేమికులను అంతేస్థాయిలో ఆహ్లాదంతో కూడిన దివ్యానుభూతిని కలుగజేస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News