Monday, December 23, 2024

మణిపూర్ సిఎంగా రెండోసారీ బిరెన్

- Advertisement -
- Advertisement -

Biren Singh for second time as Manipur CM

ఇంఫాల్ : మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎన్ బిరెన్ సింగ్ ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి కావడం ఇది సింగ్‌కు రెండోసారి. ఇంఫాల్‌లో ఆదివారం బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా బిరెన్ సింగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనితో ఆయన రెండోసారి సిఎం కావడానికి వీలేర్పడింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ పదిరోజులకు నాయకత్వ ఎంపిక జరిగింది. బిస్వజిత్ సింగ్, యుమ్నామ్ ఖేమ్‌చంద్‌లు కూడా పదవి కోసం పోటీ పడ్డారు. తరువాత ఇప్పుడు జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో బిరెన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటన వెలువడింది. దీనితో పదిరోజుల సస్పెన్స్ ముగిసింది. మణిపూర్‌లో తదుపరి సిఎం ఎంపిక కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరెన్ రిజిజులు పార్టీ తరఫున పరిశీలకులుగా వచ్చారు. ఎంపిక తరువాత బిరెన్ సిఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించారు. ఓ ఫుల్‌బాల్ ఆటగాడు, జర్నలిస్టు అయిన 61 సంవత్సరాల బిరెన్ ఆధ్వర్యంలోనే మణిపూర్‌లో బిజెపి ప్రచారం సాగింది. బిరెన్ ప్రమాణస్వీకార తేదీ వెలువడాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News