Monday, January 27, 2025

రెండు తలల దూడ జననం

- Advertisement -
- Advertisement -

మంచాల: మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో గేదె శుక్రవారం రెండు తలల వింత దూడకు జన్మనిచ్చింది. వివరాలలోకి వెళితే.. బద్దుల లింగయ్య అనే రైతుకు చెందిన గేదె శుక్రవారం రెండు తలల దూడకు జన్మనిచ్చింది. ఈ దూడను చూసేందుకు గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ విషయం కాస్త చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ఇతర గ్రామాల ప్రజలు కూడా దూడను చూసేందుకు వచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పశు వైద్య సిబ్బంది శ్రీశైలం పిండం అభివృద్ధి చెందే క్రమంలో ఏర్పడే జన్యు లోపం వల్ల అరుదుగా ఇటువంటి దూడలు జన్మిస్తాయన్నారు. ఇలా జన్మించిన దూడలు బతకడం కష్టమేనని తెలిపారు. దూడ మరణించినట్లు రైతు లింగయ్య తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News