Monday, December 23, 2024

బర్త్‌డే.. సతీమణితో కలిసి మొక్కలు నాటిన మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తన జన్మదినాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో సతీమణి గుంటకండ్ల సునితా జగదీష్‌రెడ్డితో కలసి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్, రామచంద్ర నాయక్, అనిల్ కుర్మాచలం, రాజీవ్ సాగర్, పల్లె రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన కరీంనగర్ సిపి ఎల్.సుబ్బరాయుడు
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాగంగా కరీంనగర్ పోలీసు కమిషనరేట్ కేంద్రంలో తమ సిబ్బందితో కలిసి నగర పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు మంగళవారం మొక్కలు నాటారు . ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ నేటి తరాలకు మొక్కల యొక్క ఆవశ్యకత తెలపవలసిన అవసరం మనపై ఉందన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని రక్షించుకొనే భాద్యత కూడా మనమే చేపట్టాలన్నారు. అదే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 6 విడతలలో ‘ప్లాస్టిక్ బ్యాగులను, ప్లాస్టిక్ సంబందించిన వస్తువులను వాడకూడదు‘ అనే నినాదంతో, ప్లాస్టిక్ వాడకం వలన వాతావరణంలో కలిగే మార్పులు , నేలకు జరిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం గొప్ప విషయమని అన్నారు. ప్రకృతిని కాపాడుకునే భాద్యత ప్రజలందరిపై ఉంటుందన్నారు. మన ఇంటిని శుభ్రంగా వుంచినట్లే పరిసరాలను చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేసినందుకు ఎంపి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో అడిషనల్ డిసిపి శ్రీనివాస్, అడిషనల్ డిసిపి ఎం. భీమ్ రావ్, ఏసీపీ ప్రతాప్ , ఎస్ బి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మోడెమ్ సురేష్ అడ్మిన్ , మురళి సి.ఫ్ .ఎల్ తదితరులు పాల్గొన్నారు.

S Srinivas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News