Monday, January 20, 2025

కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే పార్టీ…. వివాదంలో చిక్కుకున్న సిఐలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాదాపూర్ సిఐ గడ్డం మల్లేష్, పఠాన్ చెరు ట్రాఫిక్ సిఐ శ్రవణ్, రాజేంద్రనగర్ సిసిఎస్ సిఐ సంజయ్ వివాదంలో చిక్కుకున్నారు. ముగ్గురు సిఐలు కేబుల్ బ్రిడ్జిపై నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడ్డారు. కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలు నిషేధం అంటూ గతంలో మాదాపూర్ సిఐ మల్లేష్ ప్రకటనలు జారీ చేశారు. తాజాగా అదే కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలో ముగ్గురు సిఐలు పాల్గొన్నారు. కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేస్తామని సదరు సిఐ గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే. ముగ్గురు సిఐలు నిబంధనలు ఉల్లంఘించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. కానీ నిబంధనలు తమకు వర్తించవని ముగ్గురు సిఐలు రుజువు చేశారు. పోలీస్ ఉన్నాతాధికారులు ముగ్గురు సిఐలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News