Monday, December 23, 2024

ఆ రోజు ఎక్కువమంది తిన్నది ఏ ఫుడ్డో తెలుసా?

- Advertisement -
- Advertisement -

బిర్యానీ అంటే హైదరాబాద్ కు మాత్రమే పరిమితం అనుకునేవారు ఈ వార్త  చదివాక తమ అభిప్రాయం మార్చుకోవాలి. ఎందుకంటే, డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా ఎక్కువగా ఆర్డరిచ్చిన వంటకం బిర్యానీయే. నిన్న మొన్నటివరకూ మొదటి స్థానంలో పీజా ఉండేది. ఇప్పుడు పీజాను దాటి బిర్యానీ మొదటి స్థానంలోకి వచ్చేసింది.

కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ డిసెంబర్ 31న యూత్ ఎక్కువగా బిర్యానీని ఆర్డర్ చేసిందంటూ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేర్కొంది. జొమాటో ఎక్కువగా డెలివరీ చేసిన పుడ్ ఐటెమ్ ఇదేనట. బిర్యానీ తర్వాత పీజా, బర్గర్లు, ఇడ్లీలు, బ్రెడ్స్, రోల్స్, డెసెర్ట్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని జొమాటో పేర్కొంది. ఈమేరకు జొమాటో ఒక గ్రాఫ్ విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News