Monday, December 23, 2024

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్…

- Advertisement -
- Advertisement -

Karan Johar

ముంబై: బాలీవుడ్‌లో పలు సినిమాలు నిర్మించి ఫేమ్ సంపాదించుకున్న వ్యక్తి కరణ్ జోహార్. డైరెక్టర్, హోస్ట్‌ పాత్రలను కూడా నిర్వర్తిస్తుంటారు. తాజాగా ఈ ఫిల్మ్ మేకర్ అనుకోని కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయన పుట్టిన రోజు వేడుకలను జరుపుకొన్నారు. ఈ పార్టీకి అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వారిలో కొంత మందికి కరోనా సోకింది. దీంతో అందరు ఆయన వైపే వేళ్లెత్తి చూపారు. తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్ పేరు ఉందని తెలియడంతో బాలీవుడ్‌లో కలకలం రేగింది.

కొన్ని రోజుల క్రితమే పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ హత్య లారెన్స్ బిష్ణోయ్  గ్యాంగ్ పనేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో భాగంగా పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారు. వీరిలో లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు సిద్ధేశ్ కాంబ్లే  కూడా ఉన్నారు. సిద్ధేశ్‌ను పోలీసులు విచారణ జరపగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ను కిడ్నాప్ చేయాలని ఈ ముఠా అనుకుందట. రూ. 5కోట్లకు పైగా ఆయన నుంచి రాబట్టాలని ప్రణాళికలు రచించారట. ప్రస్తుతం ఆయన వెల్లడించిన అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News