Saturday, November 2, 2024

జన్‌ధన్ ఖాతాల హ్యాక్

- Advertisement -
- Advertisement -

Bitcoin scam accused hacked Jan Dhan accounts

రూ 6వేల కోట్ల మళ్లింపు
బిట్‌కాయిన్స్ నిందితుడి పనే?
కర్నాటక మాజీ సిఎం కుమార

బెంగళూరు : బిట్‌కాయిన్ స్కామ్ నిందితుడు జన్‌ధన్ ఖాతాలను ఏకంగా రూ 6000 కోట్ల మేర దోచుకున్నాడని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. ప్రతి ఖాతానుంచి సదరు నిందితుడు రూ 2 కోట్ల చొప్పున హ్యాక్ చేసి , వేరే ఖాతాలోకి బదలాయించాడని , దీని విలువ ఇప్పుడు దాదాపు రూ 6000 కోట్ల వరకూ ఉంటుందని కుమారస్వామి తెలిపారు. బిట్‌కాయిన్ స్కామ్ ఇప్పుడు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి సుడిగుండం తరహాలో కుదిపేసింది. తనకు తెలిసినదాని మేరకు జన్‌ధన్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఇందులో నిజం ఎంతో తెలియదని, అయితే కేవలం జన్‌ధన్ ఖాతాల తస్కరణ మొత్తం లెక్కలే ఈ స్థాయిలో ఉన్నాయని మాజీ సిఎం తెలిపారు. బిట్‌కాయిన్ స్కామ్‌ను కప్పిపుచ్చేందుకు రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం శతవిధాలా యత్నిస్తోందని తనకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.

కర్నాటకలో తలెత్తిన బిట్‌కాయిన్స్ అవినీతిపై కాంగ్రెస్ నేతలు కూడా రాష్ట్ర బిజెపి ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలకు దిగుతున్నారు. బెంగళూరు నగరానికి చెందిన హ్యాకర్ శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి నుంచి రూ 9 కోట్ల విలువైన బిట్‌కాయిన్స్‌ను అధికారులు స్వాధీనపర్చుకున్నతరువాతి క్రమంలో పలుకుబడి గల రాజకీయ నేతలు రంగంలోకిదిగారని కాంగ్రెస్ ఆరోపించింది. కేసు పూర్తిగా వెలుగులోకి రాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ తెలిపింది. శ్రీకృష్ణ ప్రభుత్వ పోర్టల్స్ హ్యాకింగ్‌కు దిగుతూ , అక్రమ నెట్ వ్యవస్థ ద్వారా డ్రగ్స్ పంపిణీకి పాల్పడుతూ ఇందుకు బదులుగా క్రిప్టోకరెన్సీని పొందుతున్నారని కాంగ్రెస్ తెలిపింది.

బిట్‌కాయిన్‌తో బొమ్మైసర్కారు ఔటే

కర్నాటకలో వెలుగుచూసిన బిట్‌కాయిన్స్ బాగోతంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయని కాంగ్రెస్ నాయకులు ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ఈ వ్యవహారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పదవి పోతుందని ఈ ఎమ్మెల్యే , సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే కుమారుడు అయిన ప్రియాంక్ స్పష్టం చేశారు. ఈ విధంగా కర్నాటకలో 200813 మధ్యలో జరిగినట్లుగా ఇప్పుడు కూడా రాష్ట్రానికి మూడో సిఎం రావచ్చునని తెలిపారు. ఇక బిట్‌కాయిన్ వ్యవహారం నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. నమ్మకంతో పనిచేయాలని, ప్రజల కోసం ధైర్యంగా వ్యవహరించాలని , ఎటువంటి భయాలు పెట్టుకోవద్దని ప్రధాని తనకు భరోసా ఇచ్చారని విలేకరులకు బొమ్మయి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News