Thursday, January 23, 2025

ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి చేదు అనుభవం

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : రహదారి నిర్మాణంలో ఇండ్లను కోల్పోయిన బాధితులకు చెక్కులు పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మండల కేంద్రమైన లోకేశ్వరం రైతు వేదికలో బుధవారం మండలం నుండి పంచగుడి గ్రామం మీదుగా నిజామాబాద్ వెళ్లేందుకు రహదారి నిర్మాణంలో నివాస గృహాలను కోల్పోయిన బాధితులకు చెక్కులను పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ముందుగా 50 కుటుంబాలకు దాదాపు 3 కోట్ల 70 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం 15 రోజుల్లోగా ఇళ్లను ఖాళీ చేయాలని ఎమ్మెల్యే చెప్పడంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఎక్కడ ఉండాలో చెప్పాలని నిలదీశారు.

7 సంవత్సరాల క్రితం సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వకుండా జాప్యం చేసి ఇప్పుడు 15 రోజుల్లో ఇండ్లను ఖాళీ చేయాలంటే ఎలాగా అసలే వర్షాకాలం, వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండే సమయంలో ఎక్కడ ఉండాలో అని గ్రామస్తులు ఎమ్మెల్యేను నిలదీశారు. కనీసం ఇళ్లను ఖాలీ చేసేందుకు నాలుగు నెలలు సమయం కావాలని లేకుంటే చెక్కులను తీసుకునేది లేదని మొండికేశారు. తిరిగి నాలుగు నెలలు గడువు ఇస్తామని అధికారులు చెప్పడంతో చెక్కులు తీసుకున్నారు. ఏడేళ్ల కిందట ఉన్న ధరలను ఇప్పటి ధరలతో పోల్చితే ఇళ్ల నిర్మాణం ఖర్చులు మూడింతలు పెరిగిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారం సరిపోదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మెన్ జాదవ్ రాజేష్ బాబు, మాజీ జడ్పి చైర్మెన్ లోలం శ్యాంసుందర్, ఎంపిపి లలితా భోజన్న, వైస్‌ఎంపిపి మామిడి నారాయణ రెడ్డి, పిఎసిఎస్ చైర్మెన్ రత్నాకర్ రావు, బిఆర్‌ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, ఎంఆర్‌వో సరిత, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు చిన్నారావు, మెండే శ్రీధర్, కపిల్, నాలం గంగాధర్, సుదర్శన్, రెడ్డి, దడిగే రాజేశ్వర్, ప్రశాంత్, దిగంబర్, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News