Wednesday, January 22, 2025

స్మిత్‌కు చేదు అనుభవం

- Advertisement -
- Advertisement -

బర్మింగ్‌హామ్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు చేదు అనుభవం ఎదురైంది. నాలుగో రోజు ఆటలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను ఇంగ్లండ్ అభిమానులు ఎగతాళి చేశారు. 2018 బాల్‌ట్యాంపరింగ్ వివాదంలో స్మిత్ మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఘోరంగా అవమానించారు. స్మిత్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఫ్యాన్స్ ఈ చర్యలకు పాల్పడ్డారు. కాగా, ఆస్ట్రేలియాఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే మ్యాచుల్లో ఇలాంటి విషయాలు చాలా సర్వసాధారణం. ఆస్ట్రేలియా అభిమానులు సయితం గతంలో చాలా సార్లు ఇంగ్లండ్ క్రికెటర్లను ఇలాగే అవమానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News