రికార్డు బ్రేక్ 30/30
భువనేశ్వర్: ఒడిశాలోని అధికార పార్టీ బిజూ జనతాదళ్(బిజెడి) రాష్ట్రంలోని 30 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ పంచాయతీరాజ్ సంస్థల అధ్యక్షుల్లో 70 శాతం మంది మహిళలే ఉండడం విశేషం. ఇక 15 జిల్లా పరిషత్‌ల అధ్యక్షులు 40 ఏళ్ల లోపు వారే. ఈ సందర్భంఆ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో 30 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుని తమ పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. ఒడిశా చరిత్రలో ఇది మొదటిసారి అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే పార్టీ రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయడం కూడా ఇదే మొదటిసారి కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాయగఢ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన సరస్వతీ మాఝీ(23) అత్యంత పిన్నవయస్కురాలు. ఆమె తర్వాత 26 ఏళ్ల వయస్సులోనే మల్కాన్‌గిరీ చైర్‌పర్సన్‌గా సమారి టంగుల్ ఎన్నికయ్యారు. వీరితో కలిపి మొత్తం 21 మంది మహిళలు చైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యారు.