Monday, December 23, 2024

అసెంబ్లీ ఎల్పి కార్యాలయంలో బిజెఎల్పి సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెఎల్ పి నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం కానున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై బిజెఎల్ పి నేతలు చర్చించానున్నారు. బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఎలా ఇరుకున పెట్టాలన్న దాని పైనా చర్చించడంతో పాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం, ఉద్యోగ నోటిఫికేషన్ లు, జాబ్ క్యాలెండర్ పై ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వంటి అంశాలపై చర్చ జరుగనుంది. రైతు రుణమాఫీ, రైతు పంట సాయం, నిరుద్యోగుల సమస్యల పైనా ప్రభుత్వంను నిలదీయాలని వ్యూహం రచించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News