Friday, November 22, 2024

బిఆర్‌ఎస్‌తో పొత్తు అసాధ్యం : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లోనే కాదు.. ఆ తరువాత కూడా బిఆర్‌ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ స్పష్టం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న బండి సంజయ్ నార్త్ కరోలినాలోని చార్లోటే లోని హిందూ సెంటర్‌లో “ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి” ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ లో పార్టీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్, కార్యదర్శి బొమ్మ జయశ్రీ, సోషల్ మీడియా మాజీ కన్వీనర్ వెంకటరమణ, అరవింద్ మోదిని, ఆనంద్ జైన్, శ్రీకుమార్ వేల్పుల, శ్యాం సుందర్ పడమటి, సుభాష్, దిలీప్‌రెడ్డి, నీఖేత్ సాయినితో కలిసి పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ మజ్లిస్ పార్టీతో అంటకాగుతున్న బిఆర్‌ఎస్ తో పొత్తు ఎలా సాధ్యమని, ఆ ఆలోచనకే తావు లేదని ఉద్ఘాటించారు.

తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా… లేదా ఎంపిగా పోటీ చేయాలా? అనేది పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు.140 కోట్ల భారతీయులే తన కుటుంబంగా భావించి సెలవు తీసుకోకుండా.. రోజుకు 18 గంటలు కష్టపడుతున్న నాయకుడు ప్రధాని మోడీ అని కొనియాడారు. 80 కోట్ల మంది పేదలకు గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచితంగా ఆహార ధాన్యాలు అందుతున్నాయి.  జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ నల్లా నీళ్లు… అవాస్ యోజన కింద పేదల సొంతింటి కల సాకారమవుతోందన్నారు. అమెరికాలో సీనియర్ సిటిజన్‌కు ఐటి చెల్లింపుల్లో రిబేట్ ఇస్తారు.. ఇండియాలో కూడా దీనిని అమలు చేసే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.

 ఉదయనిధి వ్యాఖ్యలపై మండిపాటు..
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు.సనాతన ధర్మాన్ని కించపర్చినోళ్లంతా సమాధులయ్యారు.నిజమైన నిఖ్సాన హిందువని చెప్పుకున్న కెసిఆర్ ఎందుకు స్పందించరు?.. ఐఎన్డీఐఏ కూటమిలోని పార్టీలు దీనిపై ఎందుకు స్పందించలేదు? అని ఆయన ప్రశ్నించారు. సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తే తీవ్రమైన పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News