Monday, January 20, 2025

పంజాబ్‌లో బిజెపి ఒంటరి పోరు

- Advertisement -
- Advertisement -

శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు లేదు

చండీగఢ్: శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఎడి)తో తమ పొత్తు చర్చలు విఫలమయ్యాయని సూచనప్రాయంగా తెలియచేస్తూ పంజాబ్‌లోని రానున్న లోక్‌సభ ఎన్నికలలో తాము ఓంటరిగానే పోటీ చేస్తామని బిజెపి మంగళవారం ప్రకటించింది. బిజెపి ఒంటరి పోరుతో రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ అనివార్యంగా కనపడుతోంది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ నియోజకవర్గాలకు జూన్ 1న పోలింగ్ జరగనున్నది. మొత్తం అన్ని లోక్‌సభ స్థానాలలో ఒంటరిగా పోటీ చేస్తామని పంజాబ్ బిజెపి అధ్యక్షుడు సునీల్ జాకఢ్ మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పంజాబ్ భవిష్యత్తు కోసం, యువజనులు, రైతులు, వ్యాపారులు, కార్మికులు, అణగారిన వర్గాల కోసం తీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.జ పంజాబ్ ప్రజలు తమ పార్టీకి భారీ విజయాన్ని అందచేస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 1996లో బిజెపితో పొత్తు కుదుర్చుకున్న ఎస్‌ఎడి 2019 లోక్‌సభ ఎన్నికలలో కూటమి చెరో రెండు స్థానాలలో విజయం సాధించింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 2020 సెప్టెంబర్‌లో బిజెపితో సంబంధాలు తెగతెంపులు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News