Monday, November 25, 2024

పొత్తుపై బిజెపి-ఎఐఎడిఎంకె చర్చలు

- Advertisement -
- Advertisement -

పొత్తుపై బిజెపి-ఎఐఎడిఎంకె చర్చలు
60 అసెంబ్లీ సీట్లు కోరుతున్న బిజెపి

చెన్నై: తమిళనాడులో ఏప్రిల్ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై అధికార ఎఐఎడిఎంకె, బిజెపి చర్చలు ప్రారంభించాయి. త్వరలోనే సీట్ల పొత్తుపై ఒక అవగాహన ఏర్పడే అవకాశం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి, ఎఐఎడిఎంకె సహ-సమన్వయకర్త కె పళనిస్వామి, ఎఐఎడిఎంకె సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వంతో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జనరల్ వికె సింగ్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు బిజెపి ఇన్‌చార్జ్ సిటి రాజా, బిజెపి తమిళనాడు అధ్యక్షుడు ఎల్ మురుగన్‌లతో కూడిన బిజెపి ప్రతినిధి బృందం శనివారం చర్చలు జరిపింది. చర్చలలో బిజెపి రాష్ట్ర నిర్వాహక ప్రధాన కార్యదర్శి కేశవ వినాయగన్ కూడా పాల్గొన్నారు.
తాము గెలవడానికి ఆస్కారమున్న 60 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నామని, ఎఐఎడిఎంకె ఆలోచనలు వేరే ఉండవచ్చని, అయినప్పటికీ ఉభయ పార్లీకు ఆమోదయోగ్యంగా సీట్ల పంపకం జరుగుతుందని బిజెపి సీనియర్ నాయకుడు ఎం చక్రవర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎఐఎడిఎంకెతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని పిఎంకె, సినీనటుడు విజయకాంత్‌కు చెందిన దేశీయ ముర్కొక్కు ద్రవిడ కళగం(డిఎండికె), జికె వాసన్‌కు చెందిన తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలు భావిస్తున్నాయి. వీటికి కేటాయించే సీట్లపై కూడా ఇంకా చర్చలు ప్రారంభం కావలసి ఉంది. కాగా.దాదాపు దశాబ్దం పాటు ఎఐఎడిఎంకెకు మిత్రపక్షంగా ఉన్న ఆల్ ఇండియా సమతువ మక్కళ్ కట్చి(ఎఐఎస్‌ఎంకె) వ్యవస్థాపకుడు, సినీనటుడు శరత్ కుమార్ శనివారం మక్కళ్ నీది మయమ్ పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు కమల్ హాసన్‌తో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

BJP and AIADMK talks over Alliance in Tamil Nadu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News