Friday, November 15, 2024

ఒడిశాలో బిజెపి, బిజెడి భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

ప్రజల శ్రేయస్సు కోసం వాటిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది
రౌర్కెలాలో రాహుల్ గాంధీ

రౌర్కెలా : ఒడిశాలో బిజెపి, బిజెడి ‘భాగస్వామ్యం’ కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం వాటిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని రాహుల్ తెలిపారు. రాహుల్ రౌర్కెలాలో తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగ జరిగిన ఒక సభలో రాహుల్ సంక్షిప్తంగా ప్రసంగిస్తూ, ‘మీకు తెలిసినట్లుగా ఒడిశాలో నవీన్ పట్నాయక్, నరేంద్ర మోడీ భాగస్వామ్య ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వారు ఇద్దరూ చేతులు కలిపారు. వారు కలసి పని చేస్తున్నారు.

బిజెపికి బిజెడి మద్దతు ఇస్తుండడాన్ని పార్లమెంట్‌లో గమనిస్తున్నాను. బిజెపి ప్రేరణపై బిజెడి వ్యక్తులు మమ్మల్ని వేధిస్తున్నారు’ అని ఆరోపించారు. ఒడిశా ప్రజల కోసం బిజెడి, బిజెపి కూటమిని వ్యతిరేకిస్తున్నది కాంగ్రెస్ ఒక్కటేనని ఆయన చెప్పారు. ‘విద్వేష విపణిలో ప్రేమ దుకాణం ప్రారంభించేందుకు నేను ఒడిశాకు వచ్చాను’ అని రాహుల్ చెప్పారు. ఆయన ఒడిశాలోని బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కూడా. రాష్ట్ర ప్రజలు 30 లక్షల మంది కూలీలుగా ఇతర రాష్ట్రాలకు వలస పోయారని, రాష్ట్ర ప్రభుత్వం ‘వారి కోసం పని చేయకపోవడమే’ అందుకు కారణమని రాహుల్ ఆరోపించారు. ‘30 లక్షల మంది తమ జీవనోపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస పోగా ఒడిశా వెలుపలి నుంచి 30 మంది కోటీశ్వరులు రాష్ట్ర సంపదను దోచుకోవడానికి ఇక్కడికి వచ్చారు’ అని రాహుల్ విమర్శించారు.

ఒడిశాలో ఆదివాసీల జనాభా బాగా ఎక్కువగా ఉ ందని, కాని దళితులతో పాటు వారిని ప్రభుత్వం ‘అలక్షం చేస్తోంది’ అని ఆయన ఆరోపించారు. ‘ఆరు ఏడు గంటల పాటు మీ ‘మన్ కీ బాత్’ వినేందుకు, 15 నిమిషాల సేపు మాట్లాడేందుకు ఇక్కడ్కి వచ్చాను’ అని ఆయన చెప్పారు. ఒడిశాలో నిరుద్యోగితే అతిపెడ్ద సమస్య అని, పరిశ్రమలు సరిగ్గా పని చేయడం లేదని రాహుల్ చెప్పారు. రాహుల్ అంతకు ముందు వేదవ్యాస్ శివ్ ఆలయంలో ప్రార్థనల అనంతరం రౌర్కెలాలో తన భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించారు. రౌర్కెలాలోని ఉదిత్‌నగర్ నుంచి పన్‌పోష్ ఛక్ వరకు 3.4 కిలో మీటర్ల పాదయాత్రకు ఆయన ఉపక్రమించారు. ఎఐసిసి ఒడిశా ఇన్‌చార్జి అజయ్ కుమార్, ఒపిసిసి అధ్యక్షుడు శరత్ పట్నాయక్ వెంట రాగా రాహుల్ జనంతో ముఖాముఖి సాగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News