Monday, January 20, 2025

బిజెపి, బిఆర్‌ఎస్‌లు రహస్య మిత్రులు

- Advertisement -
- Advertisement -

నల్గొండ : బిజెపి, బిఆర్‌ఎస్‌లు రహస్య మిత్రులని, రెండూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని ఏఐసీసీ సెక్రటరీ తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్ రావ్ థాక్రే ఆరోపించారు. ఆదివారం నల్గొండ జిల్లా చందన పల్లి వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు హాజరైన థాక్రే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సిబిఐ, ఈడి, ఐటీ పలు దర్యాప్తు సంస్థలు ఉన్నప్పటికీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అక్రమాలపై ఎందుకు విచారణ జరపడం లేదన్నారు.

10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అనేక అక్రమాలు అవినీతి జరిగాయని పలుమార్లు మాట్లాడిన మోడీ, అమిత్ షాలు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక బిజెపి, బీఆర్‌ఎస్ పార్టీలు రహస్య స్నేహితులు కావడమేనన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివ కుమార్ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చే విషయంలో ఏఐసీసీ పెద్దలదే తుది నిర్ణయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దేశంలో ఉన్న అందరూ కీలక కాంగ్రెస్ నేతలు వస్తారు, పని చేస్తారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దేశంలో ఉన్న అందరూ కీలక కాంగ్రెస్ నేతలు వస్తారు, పని చేస్తారన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతు ందన్నారు.

తెలంగాణ ప్రజల సంపదను కేసీఆర్ తన కుటుంసభ్యుల కోసం దోచి పెడుతున్నారన్నారు. నిరుద్యోగులకు బిఆర్‌ఎస్ పాలన శాపంగా మారిందన్నారు. చిన్న, సన్నకారు రైతులు కేసీఆర్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వంద శాతం 2023లో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వ స్తుందన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమ ంత్రి అని, డీకే శివ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జిగా వస్తున్నాడన్న వార్తలు అవాస్తవమన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల సంపద లూటీ చేసి ఇతర రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నారన్నారు. కెసిఆర్ తన సొంత ప్రచారం కోసం వందల కోట్ల రూపాయలను ఇతర రాష్ట్రాల్లో ఉన్న మీడియాకు ఖర్చు పెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. సొంత రాష్ట్రంలో ఉన్న మీడియాను తొక్కేస్తున్నారన్నారు.

తెలంగాణ ప్రజలకు చెందాల్సిన సంపదను కేసీఆర్ కుటుంబం, బిఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేస్తున్నారన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హ యాంలో పేదలకు పంపిణీ చేసిన భూములను బలవంతంగా తిరిగి వె నక్కి గుంజుకుంటున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని పెద్దలకు కట్టబెడుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. చిన్న సన్న రైతులకు కలిగే ప్రయోజనం శూన్యమన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ రెవెన్యూ సంపద్ అందరికీ పంచబడాలి కానీ కొంతమంది సంపన్నులకే దక్కుతున్నదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కలలను, ప్రజల ఆకాంక్షలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ తెలంగాణ భవిష్యత్తు కోసం తెచ్చిన కొత్త ప్రాజెక్టులు ఏమున్నాయన్నారు. కొత్త విద్యాసంస్థలు తీసుకురాలేదని, కొత్త పవర్ ప్రాజెక్టులు ప్రారంభించలేదన్నారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు ను పూర్తి చేయలేదని, తాగునీటి కోసం గ్రామాల్లో ప్రజలు తండ్లాడుతున్నారన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందన్న సంకేతాలు రావడంతో బిఆర్‌ఎస్, బిజెపిలో ఉన్న చాలామంది నాయకులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేతలతో టచ్ లో ఉన్నారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకొని వారిని పార్టీలోకి చేర్చుకుంటామన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ గమ్యం, గమనం లేని నేత పొద్దుతిరుగుడు పువ్వు గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రమే అన్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ అధికారం చుట్టు తిరిగే వ్యక్తి గుత్తా సు ఖేందర్ రెడ్డి అని మరోసారి విమర్శించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తున్న నాకు గమ్యం, గమనం ఉందని, భగ భగ మండుతున్న ఎండలు, గాలి వానలతో టెంట్లు కూలిన, అకాల వర్షంలో తడుస్తూ నడిచానే తప్ప పాదయాత్ర ఎక్కడ ఆపలేదన్నారు.

బిఆర్‌ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మీడియా సాక్షిగా దేశానికి చూపించామన్నారు. ఖాళీగా ఉన్న పైపులు, కట్టిన ట్యాంకులను ప్రజలు చూపించారన్నారు.నీళ్ల పండుగ పేరుతో జలాల్లో పసుపు, కుంకుమ వదులుతున్న మంత్రి జగదీష్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లు ఎస్ ఎల్ బి సి టన్నెల్, నక్కలగండి పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ను వదిలించుకోకుంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం లక్ష్యాలు నెరవేరకపోవడంతో పాటు తెలంగాణలో బతికే స్వేచ్ఛ లేకుండా పోతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News