Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్‌కు దేశ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది: వేముల ప్రశాంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ జనరంజక పాలన, అభివృద్ధి సంక్షేమ పథకాలకు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం చౌట్పల్లికి చెందిన బిజెపి, బిఎస్పీ పార్టీల నుంచి పలువురు నాయకులు ఆదివారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్‌కు రోజురోజుకు దేశ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, కెసిఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా కావాలన్న డిమాండ్ ప్రజల్లోంచి వస్తోందన్నారు. కెసిఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

పార్టీలో చేరిన వారు..
కొమ్ముల వెంకన్న, కొట్టాల రాజేశ్వర్, బద్దం రాజేశ్వర్, బేల్దారి సందీప్, బేల్దారి ప్రవీణ్, వంజరి గణేష్, ఏలేటి రాంచందర్, కుర్మా మహేష్ ఈ కార్యక్రమంలో సర్పంచ్ మారు శంకర్,పార్టీ ప్రెసిడెంట్ అరెల్లి నవీన్, మాజీ సర్పంచ్ రాజన్న, కొమ్ముల రాజేందర్, భట్టు అశోక్, రాజేశ్వర్, సుమన్, రజిత, మహేష్, ముతేన్న, తోట శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News