Monday, January 20, 2025

ధరల, దగా పార్టీలుగా బిజెపి ,కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్:ఎన్నికల సమయంలో ప్రజలకు ఇవ్వని హామీలను సైతం అమలు చేసి సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నామని ధరల పార్టీ దగా పార్టీలుగా పేరుకెక్కిన కాంగ్రెస్,బిజెపిల నేతలు మాట్లాడే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం చాంటి (టి) గ్రామంలో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ పార్టీ చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరైయ్యారు.

పదిహేను లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సవారి బంగ్లా షెడ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.అదే విధంగా బిఆర్‌ఎస్ పార్టీ వార్డు సభ్యులు జలారపు శ్రీనివాస్ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబానికి లక్ష రూపాయిల ఆర్థిక సాయం అందజేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో బిజెపి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బిఆర్‌ఎస్‌లో చేరారు. గంగాపుత్ర సంఘం నాయకులు బాక్రే సతీష్, బోడేవార్ మహేంధర్, కిరణ్‌ల ఆధ్వర్యంలో దాదాపు ఆరు వందల మంది రైతులు , యువకులు, గ్రామస్తులు పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత అన్ని వర్గాల ప్రజలకు సమనాయయం చేస్తూ సమగ్ర అభివృద్ధికి పాటు పడుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, రౌత్ మనోహార్, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు రోకండ్ల రమేష్, ఎంపీపీ గండ్రత్ రమేష్, టిఎస్‌ఎస్ డైరెక్టర్ కిరణ్, బోదేవర్ మహేంధర్, సర్పంచ్ దారట్ల భాస్కర్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, కుమ్ర రాజు, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News