Monday, December 23, 2024

కౌన్సిల్ సమావేశానికి కాంగ్రెస్, బిజెపిలు దూరం… సర్వత్రా విమర్శలు

- Advertisement -
- Advertisement -

ప్రత్యేక తెలంగాణ కోసం తృణ ప్రాయంగా ప్రాణాలను అర్పించిన అమరవీరుల స్మరించుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశాన్ని కాంగ్రెస్, బిజెపి పార్టీలు బహిష్కరించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీల మధ్య రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉండడం సహాజమని, అయితే అమరులను స్మరించుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశం బహిష్కరించడం సరైంది కాదన్న సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తామంటే తాము అధికారం చేపట్టబోతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్, బిజెపి పార్టీల ప్రజా ప్రతినిధులకు చట్టసభల ద్వారాకనీసం నివాళ్లు అర్పించే ఓపిక, తీరక లేదా అన్ని ప్రశ్నిస్తున్నారు.

అధికార, ప్రతిపక్షా పార్టీలు మధ్య రాజకీయాలు సహాజమేనని ఏ పార్టీ అధికారంలో ఉన్న చట్టసభల వేదికంగా వారు చేసిన అభివృద్ది, సంక్షేమ పనులు చెప్పకోవడం అత్యంత సహాజమని, అయితే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కెసిఆర్‌ను పొగిడేందుకే కౌన్సిల్ సమావేశం పెట్టారంటూ కుంటి సాకులతో కాంగ్రెస్, బిజెపి పార్టీలు బహిష్కరించడంపై తీవ్రంగా మండి పడుతున్నారు. ఈ సమావేశాలు, రాష్ట్రంలోని అన్ని మున్సిపాటీలు, కార్పోరేషన్లలో పెట్టారని ఆయా సమావేశాల్లో దాదాపు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు పాల్గొని అమరులకు నివాళ్లు అర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా నగరవాసులు గుర్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News