Monday, December 23, 2024

వాళ్లను తీసుకొచ్చి మల్లన్న సాగర్ లో ముంచాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

BJP and Congress leaders drown in Mallanna sagar

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం రాకముందు సాగు, త్రాగునీరు లేక కరువుతో అల్లాడిన జప్తి నాచారంలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత చెరువు నింపుకొని ఎండాకాలంలో కూడా నీరు ఇంకి పోకుండా సమృద్ధిగా నీరు ఉందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. జప్తీ నాచారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించిన సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. దుద్దెడ టోల్గేట్ వరకు కూడా జప్తి నాచారం చెరువు నీటితో భూములు పంటలతో పచ్చని మారాయని, 4 లక్షల రూపాయల ధర పలికే భూములు ప్రస్తుతం 40 లక్షల రూపాయలకు పెరిగాయని, గింజ మిగులకుండా ఎండా కాలంలో పండిన పంటలను కొనుగోలు చేశామని,  భూమికి బరువయ్యేంత పంట రాష్ట్రంలో పండిందని హరీష్ రావు ప్రశంసించారు. పండిన పంటలను నిలువ చేయడానికి గోదాములు సరిపోవడం లేదని, రాష్ట్రం రాకముందు ఉపాధి కోసం బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి, హైదరాబాద్ లకు పోయే స్థాయి నుంచి పొలాల్లో పని చేయడానికి బెంగాల్ నుంచి, గోదాములో పని చేయడానికి బీహార్ నుంచి కూలీలు వచ్చే స్థితికి రాష్ట్రం ఎదిగిందన్నారు.

ఒకప్పుడు ఎండాకాలంలో పేదవారు తినడానికి తిండి లేక అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసే స్థాయి నుంచి ఇప్పుడు సగం దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగామని కొనియాడారు. ప్రతి పనికి సంగారెడ్డి పోయే స్థితి నుంచి తెలంగాణ సాధించిన తర్వాత దుద్దెడలోనే కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పనులను చక్కదిద్దుకుంటున్నామని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా డెలివరీలు చేసి వాహనాల్లో ఇళ్లకు పంపుతున్నామని, మన జిల్లా వారికి పక్క మహారాష్ట్రలో బంధువులు ఉన్నారని, ఒక్క సారి వారి వద్దకు వెళ్లి ఆ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను హరీష్ రావు అడిగి తెలుసుకోవాలన్నారు.

మన రాష్ట్రంలో లాగా మహారాష్ట్ర, కర్ణాటకలలోనే కాకుండా మరే ఇతర రాష్ట్రాలలో లక్ష 116 రూపాయలతో కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, 2016 రూపాయల ఆసరా ఫింఛను, ఉచిత బియ్యం, కెసిఆర్ కిట్ ఇలాంటి పథకాలు లేవన్నారు. తెలంగాణకు సముద్రంగా మల్లన్న సాగర్ కనబడుతోందని, ఢిల్లీ, హైదరాబాద్ లో కూర్చుని కొందరు కాలేశ్వరం నీళ్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తున్నారని, వారిని తీసుకు వచ్చి మల్లన్న సాగర్ లో ముంచాలన్నారు. సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, సూర్యాపేట జిల్లాలో చూడండి కాలేశ్వరం నీళ్లు కనబడతాయన్నారు. రాష్ట్రంలో 60, 70 సంవత్సరాలలో కనబడని సాగునీరు 6 ఏండ్లలో చూపించామన్నారు.

తెలంగాణ అన్నింట్లో ఆదర్శంగా నిలుస్తోందని, కళ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని ప్రజల గమనించాలని, తెలంగాణ రాకముందు బతుకమ్మలు వేయడానికి చెరువులో నీళ్లు లేకపోతే సర్పంచులు గుంతలు తవ్వించి ట్రాక్టర్లతో నీళ్లు పోసేవారని హరీష్ రావు గుర్తు చేశారు. ఆడవారు కొత్త బట్టలు వేసుకొని బతుకమ్మలను తీసుకెళ్లడానికి బురదతో ఇబ్బంది పడేవారని, కానీ ఇప్పుడు గ్రామ గ్రామాన రోడ్డు నిర్మించుకున్నామని, జప్తి నాచారం గ్రామంలో ఇంకా అవసరమైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. దళితుల కోసం అంబేద్కర్ భవనం, గౌడ్ ల కోసం గౌడ సంఘం భవనాలను నిర్మించేందుకు 25 లక్షల రూపాయల చొప్పున నిధులను మంజూరు చేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News