Wednesday, April 9, 2025

మంత్రి వేముల సమక్షంలో బిజెపి, కాంగ్రెస్ నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరిక

- Advertisement -
- Advertisement -

వేల్పూర్ : కెసిఆర్ జన రంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వేల్పూర్ మండలం పడగల్, హనుమాన్‌నగర్ గ్రామానికిచెందిన మండల బిజెపి, కాంగ్రెస్ నాయకులు పడగల్ సర్పంచ్ ధ్యావతి వర్షిణి రాజ్‌కుమార్ రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి వేముల సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగధర్‌రెడ్డి, పడగల్ , హనుమాన్ నగర్ గ్రామాల సర్పంచ్ ద్యావతి వర్షిణి రాజ్‌కుమార్, పల్లపు ముత్తెమ్మ, ఉప సర్పంచ్‌లు, బిఆర్‌ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సూత్రాల మహేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News