Wednesday, January 22, 2025

బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో పుట్టగతులుండవ్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెప్తారని, వాళ్లకు మళ్లీ పుట్టగతులు ఉండవని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కట్టంగూర్ మండలంలోని కలిమెర గ్రామం లో ఎస్‌డిఎఫ్ నిధుల కింద రూ. 15 లక్షల వ్య యంతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు మండల ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన బిసి కమ్యూనిటీ హాల్‌ను తన చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్ధేశించి ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ బంగారు తెలంగాణ బిఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో ప్రతి గ్రామానికి వైకుంఠధామం, ప్రతి ఊరుకి ట్రాక్టర్, ప్రతి పల్లెకు పల్లె ప్రకృతి వనం, ప్ర తి గ్రామంలో మంచినీళ్ల వసతి, సిసి రోడ్లు, డ్రైన్‌ల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రతకు పారిశ్యుద్ధ కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటేపోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాలలో దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలిపారని తెలిపారు.

నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, మళ్లీ తనను మూడవసారి ఎమ్మెల్యే గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ సంస్థ ఛైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఎంపిపి జెల్లా ముత్తి లింగయ్య, జడ్పిటిసి తరాల బలరాములు, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సి ంహ్మ, పిఏసిఎస్ చైర్మన్ నూక సైదులు, వైస్ ఎంపిపి గడుసు కోటిరెడ్డి, పి ఆర్ ఏఈ జమీల్, గ్రామ సర్పంచ్ పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, మల్లారం, పిట్టంపల్లి సర్పంచ్‌లు దాసరి సంజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

రూ. 9 లక్షల సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 15 మంది లబ్దిదారులకు రూ. 9 లక్షల రూపాయల విలువ గల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కట్టంగూర్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎ మ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండల ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం లబ్ధిదారులకు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News