Thursday, January 23, 2025

బిజెపి, కాంగ్రెస్ పాలకులు అవినీతిలో చక్రవర్తులు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : బిజెపి, కాంగ్రెస్ పాలకులు అవినీతిలో చక్రవర్తులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకులు చేసిన అవినీతి ని కంటే నేడు కేంద్రంలోని బిజెపి, బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతి ఎక్కువైందని ఆరోపించారు. బిజెపి పాలనలోని గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటకలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన కుటుంబం ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు.

దేశ ప్రధాని హోదాలో ఉన్న నరేంద్రమోడీ సీఎం కేసీఆర్‌పై అక్కసుతో అవాకులు చకవాకులు పేలారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, రాహుల్ గాంధీలు ఇద్దరు తోడుదొంగలై దేశాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తనకు కు టుంబమే లేదని చెప్పుకునే నరేంద్రమోడీకు దేశంలో లక్షల కోట్ల రు ణాలను ఎగ్గోట్టిపోయిన వారందరు ఆయన కుటుంబ సభ్యులే అ న్నారు. కొద్ది మందికి ప్రధాని ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని ఆ రోపించారు. దేశంలో ఇంటింటికి తాగునీరు సరపరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనే విషయాన్ని ప్రధాని గుర్తు ఉంచుకోవాలన్నారు.

గత 25 సంవత్సరాలుగా బిజెపి పాలనలో ఉన్న గుజరాత్ కంటే తొమ్మిదేళ్ళ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉన్న తలసరి ఆదాయం నేడు సీఎం కేసీఆర్ సారధ్యంలో మూడింతలు పెరిగిందన్నారు. నాడు 40 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పిత్తి చేస్తున్న తె లంగాణ నేడు కోటి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను అందిస్తుందన్నారు. ఎన్నికల ముందు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకవస్తాన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రధాని సహాయ నిధికి వచ్చే నిధుల వివరాలను అడగగా ఎందుకు సమాదానం ఇవ్వడం లేదన్నారు.

సీఎం కేసీఆర్ పారదర్శకమైన పాలనలోనే గ్రామాలు అన్ని ర ంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని, వాటికి జాతీయ స్థాయిలో వచ్చిన 29 పథకాలే నిదర్శనం అన్నారు. చైతన్యవంతమైన తెలంగా ణ ప్రజలు ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను పట్టించుకోరని, వాస్తవను వారికి తెలుసన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే భాజపాకు ప్ర జలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహ్మారెడ్డి, వై వెంకటేశ్వర్లు, ఉప్పల ఆనంద్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News