లక్నో: రానున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెఎపి, నిషద్ పార్టీ కలసి పోటీ చేయనున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి ఇన్‌చార్జ్‌గా నియమితులైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నిషద్ పార్టీ అధినేత సంజయ్ నిషద్ సమక్షంలో శుక్రవారం కూటమి ప్రకటన వెలువడింది. 2019 పార్లమెంటరీ ఎన్నికలలో కూడా ఈ రెండు పార్టీలు కలసి పోటీచేశాయి. బిజెపి, నిషద్ పార్టీ కూటమిగా యుపి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ విలేకరులకు తెలిపారు. సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకున్నామని, సరైన సమయంలో దీనిపై ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు. నిషద్ పార్టీతోనే కాక అప్నాదళ్ పార్టీతో కూడా పొత్తు ఉంటుందని, తామంతా కలసి రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో బిజెపి పోరాడుతుందని ఆయన చెప్పారు.
యుపి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, నిషద్ పార్టీ పొత్తు
- Advertisement -
- Advertisement -
- Advertisement -