Thursday, January 23, 2025

టిడిపితో బిజెపి పొత్తు ఊహాగానాలే:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిడిపితో భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధమైందని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కొట్టిపారేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డాలను టిడిపి అధినేత చంద్రబాబు కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. గతంలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీష్ కుమార్ వంటి ప్రతిపక్ష నేతలను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్ షా కలిసిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెలాఖరు వరకు జరిగే ‘మహజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. తెలంగాణలో బిజెపి గ్రాఫ్ పెరుగుతోందన్నారు. పార్టీని దెబ్బతీసేందుకు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ సహా మరికొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News