Monday, December 23, 2024

రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు: మల్లు రవి

- Advertisement -
- Advertisement -

Illegal arrests are brutal: Mallu Ravi

హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథ సారధిని  సోనియా గాంధీ అందరి అభిప్రాయాలు తీసుకొనే పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించారని మాజీ ఎంపి మల్లు రవి తెలిపారు. రేవంత్ రెడ్డి వ్యక్తి కాదు.. పార్టీ చీఫ్ అని, మునుగోడుకు వెళ్లేటప్పుడు రేవంత్ కు ఘనస్వాగతం పలికారని ప్రశంసించారు. శుక్రవారం చందూర్ మీటింగ్ కు 30వేల మంది వచ్చారని, కానీ రేవంత్ ను టార్గెట్ చేస్తూ కొందరు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరకముందే ఈటెల కూడా కామెంట్ చేశారన్నారు. హుజురాబాద్ బిజెపి గెలవలేదని ఈటెల రాజేందర్ గెలిచారని, మునుగోడు హుజురాబాద్ కాదన్నారు. కాంగ్రెస్ లో వుండి కూడా బిజెపికి రాజగోపాల్ పనిచేసిన విషయం అందరికి తెలుసునని, వరంగల్ లో జరిగిన రాహుల్ గాంధీ మీటింగ్ కు రాజగోపాల్ రెడ్డి కూడా రాలేదని, కర్ణుడి రథసారధి సెల్యుడి తరహాలో రాజగోపాల్ పనిచేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపి, ఎమ్మెల్యే అయిన తరువాత కాంగ్రెసేనే విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నే దాసోజు శ్రవణ్ కు వలేసి బిజెపిలోకి తీసుకున్నారని, రేవంత్ ను దెబ్బతీస్తేనే కాంగ్రెస్ వీక్ అవుతుందని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దాసోజు చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నామని, పార్టీలో అన్ని కులాలకు ప్రాధాన్యత వుందన్నారు. దాసోజుకు ఓపిక లేక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయారని, జాతీయ స్థాయిలో చాలా పెద్ద నాయకుడు అవుతారని, పార్టీ మారితే సరే కానీ కాంగ్రెస్ పై విమర్శలు చేయకండని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News