16 మంది రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బిజెపి
న్యూఢిల్లీ: రాజ్యసభ స్థానాలకు భారతీయ జనతా పార్టీ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. 8 రాష్ట్రాలనుంచి 16మందికి రాజ్యసభ సీట్లు కేటాయించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్నాటకనుంచి, పీయూష్ గోయల్‌కు మహారాష్ట్రనుంచి అవకాశం కల్పించారు. సుశ్రీ పటిదార్‌కు మధ్యప్రదేశ్‌నుంచి, జగ్గేశ్‌కు కర్నాటకనుంచి, అనిల్‌సుఖ్‌దేవ్ రావ్ బొండెకు మహారాష్ట్రనుంచి , ఘన్‌శ్యామ్ తివారీకి రాజస్థాన్‌నుంచి అవకాశం కల్పించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌నుంచి లక్షీకాంత్ వాజపేయి, రాధామోహన్ అగర్వాల్,సురేంద్రసింగ్‌నగర్, బాబూరామ్ నిషద్,దర్శన్ సింగ్ సంగీతాయాదవ్‌కు స్థానం కల్పించారు. ఉత్తరాఖండ్‌నుంచి కల్పనా సైనా,బీహార్‌నుంచి సతీశ్ చంద్ర దూబే, హర్యానానుంచి కిషన్‌లాల్‌లకు చోటు కల్పించారు. బిజెపి కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఓప్రకటన విడుదల చేసింది.