Tuesday, November 5, 2024

నలుగురు ఎంఎల్‌సి అభ్యర్థులను ప్రకటించిన బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో ఎంఎల్‌సి ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలో బిజెపి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్స్ ఎంఎల్‌సి స్థానానికి బిజెపి తరపున ఎ.వెంకట నారాయణ రెడ్డి (ఎవిఎన్ రెడ్డి)ని బరిలోకి దింపుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల స్థానానికి బిజెపి అభ్యర్థిగా నాగర్రు రాఘవేంద్ర, ప్రకాశం-నెల్లూరు- చిత్తూరు జిల్లా పట్టభద్రుల అభ్యర్ధిగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల అభ్యర్ధిగా పి. వి. ఎన్. మాధవ్‌లను బిజెపి అధిష్టానం ప్రకటించింది.

ఇదిలావుండగా ఈనెల 16న ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది, నామినేషన్లకు చివరి తేదీ ఈనెల 23, నామినేషన్ల పరిశీలన ఈనెల 24, నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 27 వరకు ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం మార్చి 13న పోలింగ్ జరగనుండగా, మార్చి 16న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈసారి టీచర్ ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రైవేటు టీచర్లకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News