రోడ్డు షోలు, ప్రజాహిత యాత్రలు, విజయసంకల్ప యాత్రకు ప్లాన్
పార్లమెంటు ఎన్నికల కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుపు లక్ష్యంగా రాష్ట్ర బిజెపి 35 కమిటీలను ఏర్పాటు చేసింది. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశ నిర్వహించి ఈ కమిటీలను వేసింది. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు గెలవడమే తమ లక్ష్యమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటు శాతాన్ని మరింత పెంచుకునేందుకు రాష్ట్ర పక్కా ప్రణాళికలు రచిస్తోందని,అందులో భాగంగా సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ప్రజాహిత యాత్రలు, విజయ సంకల్ప యాత్రలు ప్లాన్ చేసిన్నట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆపార్టీ రాష్ట్ర సహా ఇంఛార్జీ అరవింద్ మీనన్ హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర నేతలు లక్ష్మణ్, డికె అరుణ, ఈటల రాజేందర్, మురళీధర్ రావు, జితేందర్ రెడ్డి, చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఇందులో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, సభలు సమావేశాలు, మేనిఫెస్టో, ఛార్జిషీట్ అంశాలపై చర్చించారు.
లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి నియమించిన కమిటీలు:
పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బిజెపి 35 కమిటీలు వేసింది. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీకి కో- కన్వీనర్‌లుగా ఏవీఎన్ రెడ్డి, గరికపాటి, రామచందర్‌రావులను నియమించారు.
మరోవైపు ఎన్నికల కార్యాలయం ప్రముఖ్‌గా రంగారెడ్డి, సమ ప్రముఖ్‌గా మాధవిలు నియమితులయ్యారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ప్రముఖ్‌గా లక్ష్మణ్‌కు మరో బాధ్యతను అప్పగించిన అధిష్ఠానం, పార్టీ ఛార్జిషీట్ కమిటీ ప్రముఖ్‌గా సీనియర్ నాయకుడు మురళీధర్ రావుకు బాధ్యతలు అప్పగించారు. మీడియా కమిటీ ప్రముఖ్‌గా కృష్ణ సాగర్ రావు, మీడియా రిలేషన్స్ కమిటీ ప్రముఖ్‌గా ప్రకాష్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీకి పోరెడ్డి కిషోర్ రెడ్డి, ఎన్నికల కమిషన్, లీగల్ ఇష్యూస్ కమిటీ ప్రముఖ్‌గా ఆంథోనీ రెడ్డిలను పార్టీ నియమించినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.