Sunday, October 6, 2024

కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా అశోక్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భారతీయ జనతా పార్టీ కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆర్ అశోక్‌ను శుక్రవారం నియమించింది. బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశం అనంతరం అశోక్‌ను ప్రతిపక్ష నాయకుడిగా నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ పదవికి సునీల్ కుమార్, అశ్వత్థ నారాయణ, అరగ జ్ఞానేంద్ర పేర్లు వినిపించినప్పటికీ చివరికి అశోక్‌ను ఎన్నుకున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఆరునెలలు కావస్తున్నప్పటికీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని ప్రకటించకపోవడంపై బిజెపిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. గత మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా, బిజెపి ఘోరపరాజయం పాలయిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4నుంచి బెలగావిలో కర్నాటక శాసన సభ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతను ఎంపిక చేస్తూ బిజెపి నిర్ణయం తీసుకుంది. గత జులైలో అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష నేత లేకుండానే జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News