Monday, December 23, 2024

కర్నాటక బిజెపి అధ్యక్షుడిగా యెడ్యూరప్ప కుమారుడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయిన భారతీయ జనతా పార్టీ తాజాగా ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చింది. బిజెపి కర్నాటక విభాగం అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్ప కుమారుడు బిఎవై విజయేంద్రను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. 2020నుంచి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయేంద్ర అధ్యక్షుడి స్థానంలో ఉన్న నళినీకుమార్ కటీల్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చుతారనే ఊహాగానాలకు దీనితో తెరపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయేంద్ర తన తండ్రి స్థానమైన శికారిపురనుంచి తొలిసారి ఎంఎల్‌ఎగా గెలుపొందారు.

న్యాయవిద్య పూర్తి చేసిన విజయేంద్ర గతంలో భారతీయ జనతా యువమోర్చా (బిజెవైఎం) ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. కర్నాటకలో బిజెపిపై లింగాయత్ నేత యెడ్యూరప్ప ప్రభావాన్ని అధిష్ఠానం అంగీకరిస్తోందనడానికి ఈ నియామకమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా విజయేంద్ర నియామకం యెడియూరప్పకు రాజకీయ వారసత్వంగా భావిస్తున్నారు. యెడ్యూరప్ప పెద్ద కుమారుడు బివై రాఘవేంద్ర ప్రస్తుతం శివమొగ్గ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News