Thursday, January 23, 2025

బిజెపి దుర్మార్గాల పాలనతోనే సిసోడియా అరెస్టు: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సూర్యాపేట: బిజెపి దుర్మార్గాలకు పరాకాష్టే ఆప్ నేత సిసోడియా అరెస్ట్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట లో సోమవారం మీడియా తో మాట్లాడారు. మంత్రి బిజెపి పాలనలో ఇడి, ఐ.టి, సిబిఐ వంటి సంస్థలు తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోయాయన్నారు. బిజెపి నేతలు చేసిన ఆరోపణల కోసం మాత్రమే కేంద్ర నిఘా సంస్థలు చేస్తున్నాయన్న మంత్రి మండిపడ్డారు.

గత కొంతకాలంగా గమనిస్తే బిజెపి నేతలు చేసిన ఆరోపణల పైనే ఎక్కువగా సి.బి.ఐ, ఇడి దాడులు జరిగాయని అర్దమవుతుందన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. బిజెపి హేతర రాష్ట్ర ప్రభుత్వాల పై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అప్రజాస్వామికం అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి అరాచకాలు ఇలానే కొనసాగితే దేశ ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని, అణచివేతల ద్వారా, జైళ్ల ను నింపడం ద్వారా ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని చరిత్ర చెబుతుందన్నారు.
బిజెపి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News