Wednesday, January 22, 2025

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపైనే బిజెపి దాడి!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణలోని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రసంగించారు. శనివారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ర్యాలీ జరుగనున్న సందర్భంగా తెలంగాణలోని అధికార పార్టీపై దాడి చేశారు. వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయలేకపోయిందన్నారు.

‘కాంగ్రెస్ ప్రజలకైతే వాగ్దానం చేసింది కానీ వాటిని అమలు చేయలేకపోతోంది. నేను కాంగ్రెస్ ను , రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాను. మీరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆరు గ్యారంటీలను’ వాగ్దానం చేశారు. 100 రోజుల్లో పూర్తి చేస్తామని కూడా చెప్పారు. వాగ్దానాలను పూర్తిగా అమలు చేయకుండానే  రాహుల్ గాంధీ తెలంగాణకు ఎలా రాగలుగుతున్నారో చెప్పాలి’ అని కిషన్ రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాగ్దానాల అమలుపై దృష్టి పెట్టడం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులను లాక్కోవడంపై మాత్రమే దృష్టి పెడుతున్నారు అని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కెసిఆర్ ఆధ్వర్యంలోని బిఆర్ఎస్ పార్టీ పెద్దగా పాత్రను పోషించడంలేదని కూడా కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కూడా బలం మెల్లమెల్లగా కోల్పోతోంది. ఇక తెలంగాణ ముఖ్య పాత్ర పోషించబోయేది బిజెపి మాత్రమేనని తెలిపారు.

ఈసారి తమ నినాదం ‘మరోసారి మోడీ ప్రభుత్వం’(ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్) కాదని, ప్రతి ఇంట, దేశమంతటా మోడీ అన్నదే తమ సరికొత్త నినాదం’ అని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News