Saturday, December 21, 2024

బిఆర్‌ఎస్‌పై బిజెపి బరితెగింపు దాడులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్‌పై బిజెపి బరితెగింపు దాడులు చేస్తోందని, తెలంగాణ ప్రగతిని ఆ పార్టీ అడుగడుగు నా అడ్డుకుంటోందని, వేల దాడులు, లక్షల కుట్రలను ఛేదించే పార్టీ బిఆర్‌ఎస్ అని సిఎం కెసిఆర్ పే ర్కొన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్ర మే బాగుంటే సరిపోదని, దేశం మొత్తం బా గుండాలని సిఎం కెసిఆర్ అన్నారు. ‘ఆబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో దేశం కోసం ముందుకు పోదామని పార్టీ శ్రేణులకు కెసిఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) నాయకులు, కార్యకర్తల కు సోమవారం నాడు సిఎం కెసిఆర్ ఆత్మీయ సందేశాన్ని ఇచ్చారు. నాడు మనం భయపడితే తెలంగాణ వచ్చేదా? బిఆర్‌ఎస్ ప్రయాణంలో మీరే నా బలం.. బలగం. ఇది ఎన్నిక ల సంవత్సరం.. నిరంతరం ప్రజల్లో ఉండాలి. పనికిమాలిన పా ర్టీల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని శ్రేణులకు కెసిఆర్ సూచించారు. దేశం కోసం జరిగే పోరాటాలన్నింటిలో ధర్మ మే జయిస్తుందని కెసిఆర్ ఈ ఆత్మీయ సందేశంలో పేర్కొన్నారు.

లాఠీలు, జైళ్లకు వెరవకుండా..

అన్నంతినో అటుకులు తినో.. ఉపాసం ఉండో 14 ఏ ళ్ల్లు పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. అధికారం లేకు న్నా ఉద్యమ కాలంలో బిఆర్‌ఎస్ ఎదిగిందన్నారు. పం చాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎవ్వరికీ సాధ్యంకానీ, ఏకపక్ష విజయాలు సాధిస్తూ రికార్డులను తిరగరాసిందన్నారు. 21 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను ముద్దాడింది మన పార్టీ అని ఆయన తెలిపారు.

పల్లెల్లో… గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి..

కష్ట, సుఖాల్లో కలిసినడుస్తూ ఒక్కొక్కరూ పల్లెల్లో, గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి నాకు కొండంత అండగా నిలిచిన మీ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేనని కెసిఆర్ పేర్కొన్నారు. ఇతరులకు పాలిటిక్స్ అంటే గేమ్, బిఆర్‌ఎస్‌కు మాత్రం టాస్క్‌అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నెరవెర్చే పవిత్ర కర్తవ్యంగా భావించి కొత్తపంథాలో నడుస్తూ కోటి ఆశలతో ఏర్పడ్డ తెలంగాణను కోటి కాంతులు విరజిమ్మే నేలగా తీర్చిదిద్దుకున్నామన్నారు. కష్టాలు.. కన్నీళ్లు.. కరువులతో అల్లాడిన తెలంగాణ.. ఈరోజు పచ్చని పంటలతో చిరునవ్వులతో కళకళలాడుతోందన్నారు. ఆగమైపోయిన తెలంగాణ నేడు కుదుటపడ్డది.. కడుపునిండాతిని.. కంటినిండా నిద్రపోతుంది.. ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.

కలలో కూడా ఊహించని కార్యాలను చేపట్టి అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చేసి చూపించి తెలంగాణను దేశానికి నమూనాగా నిలబెట్టింది బిఆర్‌ఎస్ అన్నారు. అడిగినవి.. అడగనవి.. చెప్పినవి.. చెప్పనవి ఎన్నో పనులుచేస్తూ.. అందరి బంధువుగా నిలిచాం..ఏ వర్గాన్నీ చిన్నబుచ్చలేదు.. ఏ ఒక్కరినీ విస్మరించలేదు. మనకు కులం లేదు.. మతం లేదు.. తెలంగాణ సమాజానికి పొత్తుల సద్దిమూట బిఆర్‌ఎస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. సంపదను పెంచుతూ, ప్రజలకు పంచుతూ భారతదేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించి ఉజ్వలంగా వెలుగొందుతుంది తెలంగాణ రాష్ట్రమన్నారు.

నదుల నిండా నీళ్లున్నా పొలాలకు సాగునీళ్లు రాలేదు

మనం ఇట్లా ఉంటే దేశం కథ ఇంకోలెక్కన ఉంది. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా కోట్లాది మందికి త్రాగడానికి నీళ్లులేవు. తినడానికి తిండిలేదు. నదుల నిండా నీళ్లున్నా పొలాలకు సాగునీళ్లు రాలేదు. కరెంట్ కష్టాలు తీరలేదు. అన్నీ వనరులు వసతులు ఉండికూడా భారతదేశం భంగపడుతోంది. చైనా, సింగపూర్, దక్షిణ కొరియా లాంటి దేశాలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంటే మనం ఇంకా కులాల, మతాల కుమ్ములాటల్లో మునిగిపోయి ముందడుగు వేయలేకపోతున్నామని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మన ఒక్క రాష్ట్రం బాగుంటే సరిపోదనీ, దేశం కూడా బాగుండాలని, దేశాన్ని ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్, బిజెపి పార్టీలకు తెలివి లేదని, విజన్ లేదని, సంకల్పం లేదని, అందుకే దేశానికి కొత్త ఎజెండాను నిర్ధేశించి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భారత రాష్ట్ర సమితిగా మరో ప్రస్థానాన్ని మొదలుపెట్టామన్నారు. ఏదైనా పని మొదలు పెడితే కడదాకా కాడిదించే అలవాటు లేని ఉక్కు సంకల్పం మనదన్నారు.

బిఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసే బాధ్యత మీపై…

సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో మీరే నా బలం, మీరే నా బలగమని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ చైతన్యం తొణికిసలాడే గడ్డ మనదని, ప్రజలే కేంద్రం బిందువుగా, వారి సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్న బిఆర్‌ఎస్ పార్టీని తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకో దన్నారు. చిల్లర మల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ ఆదరించదన్నారు. తెలంగాణతో బిఆర్‌ఎస్ పార్టీది పేగుబంధమని, పురిటిగడ్డపైన మరోసారి గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత మీ భుజ స్కంధాలపై ఉందని ధర్మమే జయిస్తుందని కెసిఆర్ ఆత్మీయ సందేశంలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News