Monday, December 23, 2024

గుజరాత్‌లో మళ్లీ అధికారం బిజెపిదే:ఎగ్జిట్ పోల్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : 14 మధ్య, ఉత్తరాది గుజరాత్ జిల్లాలలోని 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. దీంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీకి మొదటి విడతలో 89 స్థానాల్లో ఓటింగ్ జరగగా 93 స్థానాల్లో ఈ రోజు పోలింగ్‌ పూర్తయింది. గుజరాత్‌లో బిజెపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. బిజెపి వరుసగా ఏడోసారి అధికారం సొంతంచేసుకునేందుకు తీవ్రంగా శ్రమించింది.

స్వయంగా ప్రధానమంత్రి మోడీ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించడంతో బిజెపి మరోసారి గుజరాత్ పీఠాన్ని కైవసం చేసుకోనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. గుజరాత్‌లో మోడీ హవానే కొనసాగిందని పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలో వెల్లడైంది. గుజరాత్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎప్పటిలాగే మోదీ హవా కొనసాగింది. పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం గుజరాత్ లో బిజెపికి 125-143, కాంగ్రెస్ 30-48, ఆమ్ ఆద్మీ పార్టీకి 3-7, ఇతరులకు 2-6 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News