Sunday, January 19, 2025

కమలదళాలు కదులుతున్నాయ్

- Advertisement -
- Advertisement -

ప్రచార రంగంలోకి బిజెపి
అనుబంధ సంఘాలు
యువ, మహిళా ఓటర్లను
ఆకట్టుకునే ప్రత్యేక
ప్రణాళికలు పేద,
మధ్యతరగతిని తమవైపు
తిప్పుకునేందుకు ఎస్‌సి,
ఎస్‌టి మోర్చాలు సిద్ధం
ప్రతి ఓటర్‌ను మూడుసార్లు
కలిసేలా కార్యాచరణ

మన తెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నిక లు సమీపిస్తుండటంలో కమలనాథులు ప్రచారానికి పదును పెట్టారు. నాలుగు జాబితాల్లో 17 మంది అభ్యర్ధులను ప్రకటించి ముందుస్తుగా ప్ర జల వద్దకు వెళ్లేందుకు బిజెపి అగ్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఈసారి తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు గెలుపే లక్షంగా ఎన్నికల పోరుకు కా లు దువ్వుతున్నారు. అందుకోసం అనుంబంధ సంఘాలైన యువ మోర్చా, మహిళ, ఎస్సీ,ఎస్టీ ,ఏబివిపి సంఘాల నేతలను రంగంలోకి దిం చింది. యువ మోర్చా తొలిసారి ఓట్లు వేస్తున్న యువతను ఆకట్టుకునే విధంగా, కిసాన్‌మోర్చా రైతులతో, ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనార్టీ మోర్చాలు పేద, మధ్యతరగతి ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ఆయా వర్గాలతో నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీకి అధిక ఓట్లు వచ్చేలా సిద్దం చేస్తున్నారు.

రెండు రోజుల కితం జరిగిన పదాదికారుల సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులతో పాటు జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులకు ప్రజలను ఆకట్టుకునేందుకు అనుసరించాల్సిన వ్యుహాలను దిశానిర్ధేశం చేశారు. ప్రతి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించాలని, ప్రతి పోలింగ్ బూత్‌లో 370 ఓట్లు సాధించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి బూత్‌లో పార్టీ బలాన్ని బట్టి నాలుగు భాగాలుగా విభజించి ఓట్లు రాబట్టుకునేందు ప్రయత్నాలు చేయాలన్నారు. ఎంపి అభ్యర్థి నేరుగా ప్రతి సమావేశానికి హాజరు కావాలని, అసెంబ్లీ స్దాయిలో ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీలు సమావేశాలు తరుచు నిర్వహించి, ప్రచార కార్యక్రమాలు వేగం చేపట్టాలని పేర్కొన్నారు. ఇతర పార్టీలకు చెందిన ఆసమ్మతి నేతలతో పాటు స్దానిక కార్యకర్తలను చేర్చుకునే విధంగా ప్రత్యేకంగా ఒక టీమ్ పనిచేయాలని సూచించారు. అదే విధంగా బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతను ప్రతి నాయకుడు తన పోలింగ్ బూత్‌లో కో ఆర్డినేటర్‌గా పనిచేయాలి. నామినేషన్ల దాఖలలోపు బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాపై అవగాహన కల్పించుకోవాలన్నారు. ఎన్నికల లోపు ప్రతి ఓటరును కనీసం మూడుసార్లు కలిసే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు.

టికెట్లు రాని అసమ్మతినేలతో మంతనాలు

పార్టీ కోసం పనిచేస్తున్న కొంతమంది సీనియర్లు ఎంపి టికెట్లు ఆశిస్తే పార్టీ వారికి కాకుండా ఇతర నాయకులకు ఇవ్వడంతో వారంతా సీనియర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము పార్టీ నిర్మాణం కోసం శ్రమిస్తే తీరా సమయానికి ఇతర పార్టీ నుంచి వలస వచ్చి నేతలకు రాత్రి రాత్రికే టికెటు ఇవ్వడంపై మండిపడుతున్నారు. ప్రధానంగా నల్లగొండ స్ధానం మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, పెద్దపల్లి సీటును గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్ టికెటు గొడుం నగేష్, నాగర్‌కర్నూల్ పొతుగంటి భరత్ ప్రసాద్, హైదరాబాద్ సీటు కొంపెల్లి మాధవీలత, వరంగల్ స్ధానం ఆరూరి రమేష్, జహీరాబాద్ బిబిపాటిల్‌కు ఇవ్వడంపై అప్పటికే తనకే సీటు వస్తుందని ప్రచారం చేసుకున్న నాయకులంతా అలక వహిస్తున్నారు.

ప్రచారం చేసేందుకు ముందుకు రావడం లేదు. పాత నాయకులకు ఓట్లు పడవని, కొత్త నాయకులను ప్రజలు ఆదరిస్తారని, తమతో పార్టీకి పనిలేదని ఆవేదనతో మాట్లాడుతున్నారు. వీరంతా పార్టీకి దూరమైతే ఎంపి అభ్యర్థులు గెలుపు కష్టమేనని, పాత నాయకులను సమన్వయం చేసుకుని పోవాలని అభ్యర్థులకు హస్తిన పెద్దలు సూచించారు. అందరం కలిసి ఏకతాటిపై పనిచేస్తే విజయం వరిస్తుందని, బేధాభిప్రాయాలు ఉంటే విపక్షాలు గెలుస్తాయని, టికెట్లు ఆశించి భంగపడవారికి మూడోసారి అధికారం చేపట్టిన తరువాత నామినేటెడ్ పదవులు కట్టబెడుతామని హామీలిస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ కోసం ఆర్ధికంగా నష్టపోయిన వారికి సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు అసమ్మతి నేతల అనుచరులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News