- Advertisement -
న్యూఢిల్లీ: మే 30 నుంచి జూన్ 14 వరకు మోడీ ప్రభుత్వం ఎనిమిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని మంత్రులందరూ, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు భారీ బహిరంగ ప్రచారంలో పాల్గొంటారు. దేశంలో రేపట్నుంచి వార్షికోత్సావ కార్యక్రమాలను నిర్వహించనుంది. రెండు వారాలపాటు ఉత్సవాలు నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది. మే నెల30 నుంచి జూన్ 14 వరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నారు. సేవ-సుపరిపాలన- పేదల సంక్షేమానికి తీసుకున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెల్లే కార్యక్రమాలు నిర్వహించనుంది బిజెపి. బూత్ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ప్రజలను కలవనున్నారు. కరోనాతో తల్లిదండ్రులు చనిపోయిన అనాథ పిల్లలకు ఆర్థికసాయం అందివ్వనున్నారు. రేపు ప్రధాని మోడీ అనాథ పిల్లలకు చెక్కులను పంపిణీ చేయనున్నారు.
- Advertisement -