Monday, December 23, 2024

ఇవిఎం ధ్వంసం ఘటనలో బిజెపి నేత జైలుకు

- Advertisement -
- Advertisement -

ఒడిషాలోని ఖుర్దాలో ఇవిఎం ధ్వంసం కేసులో బిజెపి అభ్యర్థి ప్రశాంత్ జగ్‌దేవ్‌ను అరెస్టు చేశారు. తరువాత కోర్టు ఆదేశాల మేరకు ఖుర్ధా జైలుకు తరలించారు. ప్రశాంత్ ఇప్పుడు చిలికా స్థానం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఖుర్ధా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున పోటీకిదిగారు. శనివారం కౌన్‌రిపట్నలో సతీసమేతంగా ఓటేయడానికి వెళ్లాడు. అక్కడ చాలా సేపు క్యూలో ఉన్నారు. ఈ క్రమంలో ఇవిఎం మొరాయించడం, ఎన్నికల అధికారితో వ్యాగ్యుద్ధానికి దిగి కోపంతో టేబుల్‌పై ఉన్న ఇవిఎంను నెట్టేయడంతో అది కింద పడి ముక్కలైంది. దీనితో ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఆయనను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్‌పి అవినాశ్ కుమార్ సోమవారం తెలిపారు.

ఇప్పుడు ఆయనను జైలుకు పంపించినట్లు చెప్పారు. దీనిపై బిజెపి శ్రేణులు భగ్గుమన్నాయి. తన ఓట బిజెపి కార్యకర్తలు సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఇక్కడి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ జగదేవ్‌ను వెంటనే బేషరతుగా విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. జగదేవ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని, దీని వెనుక ఇక్కడి అధికార బిజెడి హస్తం ఉందని బిజెపి కార్యకర్తలు విమర్శించారు. వెంటనే తమ నేతను విడుదల చేయాలి లేకపోతే తమ ఆందోళన ఉధృతం అవుతుందని, జాతీయ రహదారిపై దిగ్బంధానికి దిగుతామని హెచ్చరించారు. పట్టణ బంద్‌కు పిలుపు ఇస్తామని తెలిపారు.ఈ నెల 25వ తేదీన ఒడిషాలో ఆరు లోక్‌సభ, 42 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News