Monday, December 23, 2024

ప్రియాంక గాంధీపై బిజెపి యువ నాయకురాలు నవ్య హరిదాస్ పోటీ

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: వయనాడ్ లో ప్రియాంక గాంధీపై బిజెపి తన మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నవ్య హరిదాస్ ను దింపింది. ఎల్ డిఎఫ్ తరఫున సిపిఐ సత్యన్ మొఖేరి ని పోటీకి నిలిపింది.  వయనాడ్ లో త్రిముఖ పోటీ జరుగుతుందని అంచనా.

బిజెపి అభ్యర్థి నవ్య హరిదాస్ కాలికట్ యూనివర్శిటీ కెఎంసిటీ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బిటెక్ చేశారు. ప్రస్తుతం కొజికోడ్ సౌత్ నియోజకవర్గం నుంచి ఎన్ డిఏ అభ్యర్థిగా పోటీచేశారు. తాజాగా వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం నవ్యపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఆమె కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ వయనాడ్ ను కేవలం రెండో ఆప్షన్ గా పరిగణిస్తోందన్నారు. కోజికోడ్ లో ఆదివారం విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ను నవ్య తనదైన శైలిలో విమర్శించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News