- Advertisement -
చాంద్రాయణగుట్ట నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్ధి యు.సత్యనారాయణ ముదిరాజ్ బరిలోంచి తప్పుకున్నారు. అనారోగ్య కారణాలవల్ల తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్లు సత్యనారాయణ బిజేపి అధిష్ఠానానికి లేఖ రాశారు. బిజెపి అభ్యర్థుల మొదటి జాబితాలో సత్యనారాయణ ముదిరాజ్ పేరు కూడా ఉంది. ఈమేరకు ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే ప్రచారం చేస్తుండగా అస్వస్థత పాలు కావడంతో వైద్యుల సలహా మేరకు ఆయన పోటీనుంచి తప్పుకుంటున్నట్లు తెలిసింది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం మొదటినుంచీ మజ్లిస్ కు పెట్టనికోట. ఇక్కడినుంచి అక్బరుద్దీన్ ఒవైసీ రెండుసార్లు… 2014, 2018లో గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ చేతిలో బిజేపి 80వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయింది.
- Advertisement -