Monday, December 23, 2024

జనం.. ధనం మధ్య ‘రణం’

- Advertisement -
- Advertisement -

మునుగోడును గాలికొదిలేసిన రాజగోపాల్ రెడ్డి

ఇప్పుడు డబ్బు సంచులతో ప్రలోభాలకు సిద్ధమవుతున్న బిజెపి నేత ఆయన అట్టర్‌ఫ్లాప్
ఎంఎల్‌ఎ కమలనాథులకు బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధం పార్టీ శ్రేణులతో నిర్వహించిన
టెలీకాన్ఫరెన్స్‌లో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నిక నియోజకవర్గం ప్రజల ఆత్మగౌరవానికి, బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్నదని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు అన్నారు. వేల కోట్ల రూపాయల అక్రమ కాంట్రాక్టులతో సంపాదించిన ధనబలంతో జనాలను పట్టించుకోకుండా ఇన్నాళ్లుగా నియోజకవర్గాన్ని తీవ్ర నిర్లక్షం చేశారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి ధనదాహానికి ఈ రోజు ఉప ఎన్నికను తీసుకొచ్చారని విమర్శించారు. టిఆర్‌ఎస్ పక్షాన మునుగోడులో ప్రచారానికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి సోమవారం కెటిఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడు తూ, రాజగోపాల్ రెడ్డి ధన దాహం, వేల కోట్ల రూ పాయల కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నికల్లో ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌లో ఉండి నియోజకవర్గాన్ని పట్టించుకోని రాజ్‌గోపాల్‌రెడ్డి….బిజెపిలో ఉండి ఏం ఉద్దరిస్తారని కెటిఆర్ ప్రశ్నించా రు. ఈ అంశాలపై ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని కెటిఆర్ సూచించారు. నాలుగు సం వత్సరాల కాలంలో మునుగోడును విస్మరించి రా జ్‌గోపాల్‌రెడ్డి నియోజకవర్గం ప్రజల విశ్వాసాన్ని నిండా ముంచారని మండిపడ్డారు.

అలాంటి వ్యక్తి పట్ల నియోజకవర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పార్టీ శ్రేణులకు కెటిఆర్ సూచించారు. అదే సమయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఎన్నికల ప్రచారం లో ప్రజలకు కూలంకషంగా వివరించాలన్నారు. అలాగే ఉపఎన్నకలో టిఆర్‌ఎస్ అభ్యర్ధి గెలిపిస్తే నియోజకవర్గం ఆ స్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్న అంశాన్ని కూడా వివరించాలన్నారు. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఒక అ ట్టర్ ఫ్లాప్ ఎంఎల్‌ఎ అని కెటిఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్దిని, ప్రజల కష్ట సుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవ లం తన కాంట్రాక్టుల గురించి మాత్రమే ఆలోచిం చే ఫక్తు రాజకీయ వ్యాపారి రాజగోపాల్ రెడ్డి అని విమర్శించారు. నియోజకవర్గ సమస్యలను వదిలేసి అసెంబ్లీలో కాంట్రాక్టర్ల బిల్లుల కోసం మాట్లాడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు.

రాజగోపాల్ రెడ్డి ధన దాహంతోనే ఈ ఉప ఎన్నిక మునుగోడు ప్రజల మీద బలవంతంగా రుద్దబడిందన్నారు. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం అనేక హామీలు ఇచ్చి వాటిలో ఏ ఒక్కదాన్ని నెరవేర్చకుండా చేతులెత్తేసిన రాజగోపాల్ రెడ్డి, ఈ ఉప ఎన్నిక సందర్భంగా మరోసారి ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బిజెపి ఇచ్చిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కమీషన్ పైసలతో బైకులు, కార్లుతో పాటు ఇతర విలువైన వస్తువులను ఓటర్లకు రాజగోపాల్ రెడ్డి పంచుతున్నారని ఆరోపించారు. ఇంకో సంవత్సరం పాటు పదవి కాలం ఉన్నా ఉప ఎన్నిక స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నిక తెచ్చారన్నారు. అయితే చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు బిజెపికి రాజగోపాల్ రెడ్డికి ఈ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పేందుకు నిరీక్షిస్తున్నారన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News