Monday, January 20, 2025

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేరు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

BJP cannot buy Telangana self respect

మునుగోడు: కొంత మంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని వంద కోట్ల రూపాయలకు కొనుగోలు చేద్దామని వచ్చారని, మన టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఎడంకాలితో కొట్టి అంగట్లో సరుకులం కాదని చెప్పారని సిఎం కెసిఆర్ కొనియాడారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చండూరు వేదిక నుంచి కెసిఆర్ ప్రసంగించారు. నలుగురు తెలంగాణ బిడ్డలు మన ఆత్మగౌరవాన్ని హిమాలయమంత ఎత్తుకు చాటారని ప్రశంసించారు. మన అత్మగౌరవాన్ని చాటిన నలుగురు ఎంఎల్‌ఎలను అభినందించాలన్నారు. నరేంద్ర మోడీ ఇంకా నీకేం కావాలి.. ప్రధాని పదవికి మించింది ఇంకేంటని కెసిఆర్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఆ అరాచకాలను ప్రోత్సహిస్తున్నావని అడిగారు. వంద కోట్ల రూపాయలు ధనం ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ జరపాలని, దీని వెనుక ఉన్నవాళ్లు ఎవరో వాళ్లు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండటానికి అర్హులు కారన్నారు. తాను చెప్పిన మాటాలను మునుగోడులో మేధావి వర్గం మనుసు పెట్టి ఆలోచన చేయాలన్నారు. ముండ్ల చెట్టు పెడితే పండు రావని, పండ్ల చెట్టు పెడితేనే పండ్లు వస్తాయన్నారు. గాడిదకు గడ్డివేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా? అని ప్రజలను అడిగారు. ఏ కేంద్రం కూడా చేయని దుర్మార్గం మోడీ ప్రభుత్వం చేస్తుందని కెసిఆర్ ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News