Saturday, November 23, 2024

బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర వాయిదా పడింది. ఈ నెల 24వ తేదీ నుండి బండి సంజయ్ కుమార్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం కళ్యాణ్ సింగ్ మరణంలో పార్టీ కార్యక్రమాలను వాయిదా వేయాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకొంది. దీంతో ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కావాల్సిన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లుగా ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ నెల తొలి వారంలో ప్రారంభం కావాల్సిన పాదయాత్రను పార్లమెంట్ సమావేశాల కారణంగా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీ నుండి ఈ యాత్రను ప్రారంభించాలని తొలుత నిర్ణయం తీసుకొన్నారు.

అయితే, పార్లమెంట్ సమావేశాల కారణంగా పార్టీకి చెందిన కీలక నేతలు ఈ పాదయాత్రలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో యాత్రను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. దీంతో పార్టీ శ్రేణులు ఈనెల 24 నుండి యాత్ర నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. యూపీ మాజీ సిఎం కళ్యాణ్‌సింగ్ మరణించడంతో.. ఆయన మృతికి సంతాపంగా అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీ వరకు పార్టీ కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించింది. దీంతో ఈ నెల 24వ తేదీ నుండి చేపట్టాల్సిన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లుగా బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రకటిచింది.

BJP Chief Bandi Sanjay’s Padayatra postponed to Aug 24

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News