Monday, December 23, 2024

మోడీకి విజన్ ఉంది : నడ్డా

- Advertisement -
- Advertisement -

BJP chief JP Nadda comments on PM Modi

న్యూఢిల్లీ : పది లక్షల మందికి ఉద్యోగాలిచ్చే రోజ్‌గార్ మేళాను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఉద్యోగమేళా కార్యక్రమంలో మాట్లాడుతూ తమ పార్టీ నేతృత్వం లోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా భారత దేశాన్ని తీర్చి దిద్దడానికి అవసరమైన విజన్ ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ఉన్నట్టు తెలిపారు. రక్షణ రంగ పరికరాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగినట్టు చెప్పారు. డిజిటల్ లావాదేశీలను పరిశీలించినప్పుడు ప్రపంచంలో 40 శాతం డిజిటల్ లావాదేవీలు మనదేశంలో జరుగుతున్నాయన్నారు. మోడీ దూరదృష్టి వల్ల ఈ సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు. అంతకు ముందు మోడీ ఎలక్ట్రానిక్ విధానంలో 75 వేల మందికి నియామక పత్రాలు పంపిణీ చేశారు. భారత ప్రభుత్వం లోని 38 మంత్రిత్వశాఖలు /డిపార్టుమెంట్లలో వీరు పనిచేస్తారు. దేశం లోని అన్ని ప్రాంతాల వారు ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News