Monday, December 23, 2024

వంతెన నిర్మాణానికి అడ్డంకులు తగదు : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అంబర్‌పేట్‌లో రహదారి వంతెన నిర్మాణానికి భూసేకరణ సమస్యలు ఉన్నాయని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం అంబర్‌పేట ఫ్లైఓవర్ పనులను ఆయన పరిశీలించారు. ఫ్లైఓవర్ నిర్మాణం పనుల జాప్యంపై ఆయన మాట్లాడుతూ భూసేకరణ సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. రహదారి నిర్మాణం చేపట్టే ్రప్రాంతంలో ఉన్న ముస్లిం శ్మశానవాటికతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ముందు ఒప్పుకున్నా,… ఇప్పుడు అడ్డంకులు సృష్టిస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి ముస్లింలను ఒప్పించాలని ఆయన కోరారు. వంతెన కడుతున్నదే,.. శ్మశానానికి అడ్డంకిగా ఉండకూడదనీ,.. దీనిని ముస్లింలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.

మహంకాళి అమ్మవారికి పూజలు..
అంబర్‌పేట్ మహంకాళి అమ్మవారిని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కిషన్ రెడ్డి, కుటుంబ సభ్యులను ఆలయ ప్రతినిధులు సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలందరికీ బోనాలు శుభాకాంక్షలు కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా,.. కరోనా లాంటి మహమ్మారి ప్రబలకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థించుకున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News